అత్యంత భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే శిలువ యాత్ర

అత్యంత భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే శిలువ యాత్ర

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని క్రైస్తవ విశ్వాసులు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పుర వీధుల్లో ఆర్ సీఎం చర్చి విచారణ గురువు ఫాదర్ మేడేపల్లి థామస్ ఆధ్వర్యంలో శిలువ యాత్ర నిర్వహించారు. ఆర్‌సీఎం చర్చి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మెయిన్ రోడ్డు, బీ కాలనీ, ఖిల్లా రోడ్డు, నాలుగు వంతెనల సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, గీతా మందిర్ రోడ్డు మీదుగా తిరిగి చర్చి వద్దకు చేరుకుంది. యాత్రలో ఏసుక్రీస్తు శిలువ గీతాలు ఆలపించారు. పాపుల రక్షణ కోసం ఏసుక్రీస్తు అనుభవించిన శ్రమలు, శిలువ మార్గం, మానవాళి విమోచన కోసం చేసి త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు శిలువను మోస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాంతి, ప్రేమ, త్యాగ సందేశాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆర్ సీఎం చర్చి సంఘ పెద్దలు, విశ్వాసులు, యువత, మరియదళ సభ్యులు, పిల్లలు పాల్గొన్నారు.

Leave a Reply