2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News

2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News

  • పాక్‌కు గ్రీన్ సిగ్నల్..
  • హోర్ముజ్ నుంచి ఓడలకు విముక్తి
  • తాజాగా 2 షిప్ప్​ విడుదల
  • రోజుకు రెండు చొప్పున
  • మరో 18 ఓడలకు విముక్తి
  • రాజీయత్నానికి బహుమతి

( ఆంధ్రప్రభ, కరాచీ ప్రతినిధి)

2 Pakistan Ships : పాకిస్థాన్​ చమురు నౌకలకు హోర్ముజ్​ జలసంధి చెర వీడింది. ఆమెరికా ఇజ్రాయల్​ చేపట్టిన ఆపరేషన్​ ఎథిక్​ ప్యూరీ కథ కంచికి చేరే రీతిలో.. పాకిస్థాన్​ జరుపుతున్న దౌత్య చర్చల నేపథ్యంలో… పశ్చిమాసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా) జరుగుతున్న యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) దాదాపు మూతబడిన స్థితిలో ఉంది. ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ దౌత్యపరమైన చర్చలు జరిపి తన నౌకల రాకపోకల కోసం ఇరాన్ నుండి ప్రత్యేక అనుమతి పొందింది.

2 Pakistan Ships : కరాచీ రేవుకు ఓడలు

మార్చి 31, 2026 నాటికి ముల్తాన్ (Multan – కార్గో నౌక) పి-అలికి (P-Aliki – సుమారు 8 కోట్ల లీటర్ల ముడి చమురుతో) ఈ రెండు పాకిస్థానీ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటి కరాచీ పోర్టుకు చేరుకున్నాయి. ఇరాన్ దళాలే ఈ నౌకలకు రక్షణగా (Escort) సురక్షితంగా పంపించాయి. ఇరాన్ ప్రభుత్వం మొత్తం 20 పాకిస్థానీ నౌకలకు ఈ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 2 నౌకలు చేరుకోగా, మిగిలిన 18 నౌకలను రోజుకు రెండు చొప్పున పంపించేలా ఇరాన్ అంగీకరించింది.

2 Pakistan Ships : స్రేమతో ఇరాన్​ .

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఇరాన్ అధికారులతో జరిపిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు కృతజ్ఞతగా ఇరాన్ ఈ “హెర్బింగర్ ఆఫ్ పీస్” (శాంతి సంకేతం) నిర్ణయాన్ని తీసుకుంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయింది. హోర్ముజ్ జలసంధి ద్వారా కేవలం 10% ట్రాఫిక్ మాత్రమే సాగుతోంది. కేవలం స్నేహపూర్వక దేశాలకు (భారత్, చైనా, పాకిస్థాన్ వంటివి) మాత్రమే ఇరాన్ పరిమితంగా అనుమతి ఇస్తోంది.
పాకిస్థాన్ నేవీ తన వాణిజ్య నౌకల రక్షణ కోసం “ఆపరేషన్ ముహాఫిజ్-ఉల్-బహర్” (Operation Muhafiz-ul-Bahr) చేపట్టింది

Leave a Reply