eiffel tower | విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం

eiffel tower | విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం
eiffel tower | ఈఫిల్ టవర్ ను చూడటం వేరు, అనుభవించడం వేరు
ప్యారిస్ నగరపు సుందర దృశ్యాలు & పూలతోటలు
సూర్యోదయం & రాత్రి లైట్లలో అద్భుతం
ఫోటోగ్రఫీ కోణాల్లో ప్రత్యేకత & ఆకర్షణ
ప్రతి యాంగిల్ ఒక కొత్త కథ, ఒక కొత్త అనుభవం
eiffel tower | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఈఫిల్ టవర్ ని చూసారా మీరెప్పుడైనా? అదేం ప్రశ్న అనుకోకండి. కొంత మంది అక్కడి దాకా వెళ్ళి ఉంటారు, చాలా మంది వెళ్ళక పోయి ఉంటారు. కానీ, ఈఫిల్ టవర్ ని ప్రత్యక్షంగానో, ఫోటోలు, వీడియోల్లోనో అనేక మంది చూసే ఉంటారు.

కానీ, ఎన్ని యాంగిల్స్ లో చూసి ఉంటారు? ఎక్కడెక్కడి నుంచి చూసారు? ఎందుకంటే, మామూలుగా చూడడం వేరు, ఈఫిల్ టవర్ అందాలను రకరకాల యాంగిల్స్ లో చూసి ఆనందించడం వేరు.
చాలా మంది కేవలం ముందర నుండి ఫోటోల్లో చూసి ఉండొచ్చు. కానీ, ఒక్కసారి ఈఫిల్ టవర్ పైకి ఎక్కి, చుట్టు పక్కలను సునిశితంగా గమనిస్తే… చుట్టూ ప్యారిస్ నగరం అందాలు, అక్కడక్కడా అందమైన పూలతోటలు, గలగల పారే నదీ దృశ్యాలు, రాత్రి పూట ప్రకాశించే లైట్ల ధగధగలు… అన్నీ కలిపి మరచిపోలేని మధురానుభూతిని ఇస్తాయి.
ప్రతీ సూర్యోదయం, ఈ టవర్ కొత్తకొత్త రంగుల్లో కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉదయం ధవళ కాంతి, రాగి రంగు లో ప్రకాశిస్తుంది. ఫోటోలు చూస్తే ఎల్లప్పుడూ అదే టవర్ అనిపించవచ్చు, కానీ సూర్యోదయపు కాంతిలో కలిసినప్పుడు అది మరింత అద్భుతంగా అనిపిస్తుంది.

వీధుల నుంచి, పై నుంచి, నదీ తీరాల నుంచి ఈఫిల్ టవర్ ని కేవలం ప్యారిస్ వీధుల నుండి చూడటం వేరు, నదీ తీరాల నుండి చూడటం వేరు, పై నుంచి చూడటం వేరు. మనం చూసే ప్రతి కోణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఒక్కోచోటి నుంచి చూస్తే, ఒక్కో కొత్త కోణంలో కొత్త ఆకారంగా, కొత్త వెలుగు నీడల ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.
రాత్రి పూట ఈఫిల్ టవర్ విద్యుత్ లైట్లతో ధగధగలాడుతుంటుంది. ప్రతి 5 నిమిషాలకు మినీ ట్వింక్లింగ్ లైట్ షో కనిపిస్తుంది. ఆ కాంతిలో, ప్యారిస్ నగరం చుట్టూ ఉన్న అద్భుతమైన సౌందర్యం మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆకర్షించే అద్భుతమైన అనుభవం.

మామూలు కోణంలో ఈఫిల్ టవర్ వద్ద ఫోటో తీసుకోవడం వేస్ట్… ప్రతి యాంగిల్, ప్రతి కాంపోజిషన్, ప్రతి లైన్ & షాడో ఫోటోకు ఒక ప్రత్యేకమైన రూపు వస్తుంది. సరిగ్గా ఎక్కడ నిలబడితే, టవర్ పైగా, క్రిందగా, చుట్టూ ఉన్న గార్డెన్స్ తో అద్భుతమైన కాంబినేషన్ లో కనిపిస్తుంది.

ప్రతీసారి ఈఫిల్ టవర్ చూసినప్పుడు, వేరు వేరు అనుభూతులు కలుగుతాయి. ఒక్కసారి మాత్రమే చూస్తే చాలని అనుభూతి… ఈఫిల్ టవర్ సందర్శన. ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు, అద్భుతమైన ఆనందాల అనుభూతుల అనుభవం, కలకాలం గుర్తుండిపోయే కళారూపం. మనిషి మెదడులోని ఊహాశక్తికి ఆర్కిటెక్చర్ కలిసిన వాస్తవిక రూపం.
