సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ,

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ,
–చిట్యాల ఎస్.ఐ ,పోచంపల్లి సతీష్
చిట్యాల, ఆంధ్రప్రభ : సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిచిట్యాల ఎస్.ఐ ,పోచంపల్లి సతీష్ కోరారు . బుధవారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆవరణలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయి” లేదా “మీరు క్రైమ్ చేశారు” అని భయపెట్టి, వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని గంటల తరబడి బంధించి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆశ చూపిస్తారని, నకిలీ వెబ్‌సైట్లలో లాభాలు కనిపిస్తున్నట్టు నమ్మించి, భారీగా డబ్బులు కట్టించుకుని మోసం చేస్తార న్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సతీష్ కుమార్ కోరారు.
