అంగన్వాడీలో పౌష్టికాహారం అందజేత..

అంగన్వాడీలో పౌష్టికాహారం అందజేత..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామములో అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఈసంపల్లి హారిక సందర్శించారు. బుధవారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అంగన్వాడీకి వచ్చినటువంటి గుడ్లు, పాలు, బియ్యం, పప్పులు అందించారు. పౌష్టికహారం ప్రతి రోజు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రతి రోజు సబ్బుతో చేతులను శుభ్ర పర్చుకోవలని, ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ తెలిపారుఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, గర్భిణీలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply