టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

రాప్తాడు, ఆంధ్రప్రభ : ఒక కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఇటీవల ప్రమాదాల్లో చనిపోయిన టిడిపి కార్యకర్తల కుటుంబాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రూ. 15లక్షలు బీమా పత్రాలను అందజేశారు. చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన కృష్ణనాయక్ గత ఏడాది ఏప్రిల్ నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనంతపురం రూరల్ మండలం కందుకూరు కు చెందిన గోగుల నారాయణస్వామి రాప్తాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు.

రాప్తాడు మండలం బండమీద పల్లికి చెందిన మాధవయ్య గత ఏడాది మార్చిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముగ్గురికి టిడిపి సభ్యత్వాలు ఉండటంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ప్రకారం రూ.15 లక్షలు ప్రమాద బీమా మంజూరైంది. పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఈ బీమా పత్రాలను రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత బాధిత కుటుంబ సభ్యులకి అందజేశారు. దేశంలో ఒక కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు.

మంత్రి నారా లోకేష్ చొరవవల్లే ఇలాంటి సాయం టిడిపి కార్యకర్తల కుటుంబాలకు జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టిడిపి ఇన్చార్జి బాలాజీ రాప్తాడు టిడిపి ఇంచార్జ్ ధర్మవరపు మురళి ఎంపీడీవో విజయలక్ష్మి ఆర్డీటి ఏటిఎల్ మల్లికార్జున మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు పిఎసిఎస్ చైర్మన్ గోపాల్ నాయుడు రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు సర్పంచులు సాకే తిరుపాలు నరేష్ డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు అచ్యుతానంద బాబు హంపాపురం ప్రతాప్ నాయుడు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు రామాంజినమ్మ క్లస్టర్ ఇన్చార్జిలు సోమర నారాయణస్వామి సిసి రాము తదితరులు పాల్గొన్నారు.