Vijay | నియమావళి ఉల్లంఘన ఆరోపణలు

Vijay | నియమావళి ఉల్లంఘన ఆరోపణలు
Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది.
తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై చెన్నైలో కేసు నమోదైంది. పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేయగా, మానిటరింగ్ అధికారి కుమార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… విజయ్ నిర్వహించిన కార్యక్రమంలో అనుమతించిన దానికంటే ఎక్కువగా లౌడ్ స్పీకర్లు వినియోగించినట్లు ఆరోపించారు. అలాగే అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, ఐదు వేల మందికి పైగా జనసమూహం గుమిగూడటం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగిందని పేర్కొన్నారు.
ఈ కారణాలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అధికారులు భావించి కేసు నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
