seats234 | ఆధిక్యంలో టీవీకే పార్టీ

seats234 | ఆధిక్యంలో టీవీకే పార్టీ

seats234 | త‌మిళ‌నాడులో 28 మంత్రులకు షాక్‌
వంద‌కు పైగా స్థానాల‌లో టీవీకే పార్టీ లీడ్
హంగ్ దిశ‌గా ఫ‌లితాలు
స్టాలిన్ స‌హా 28 మంత్రులు వెనుకంజ‌
రెండో స్థానంలో అన్నా డీఎంకే

త‌మిళ‌నాడు : మొత్తం స్థానాలు 234
టీవీకే పార్టీ : 106
అన్నా డీఎంకే : 72
డీఎంకే : 51

seats234 | ఎల‌క్ష‌న్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : త‌మిళ‌నాడులో సినీ హీరో విజ‌య్ పార్టీ సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న‌ది.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఇప్ప‌టికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఈ పార్టీ దాటికి డీఎంకే అధినేత‌, ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో స‌హా ఆయ‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు 28 మంది ఓట‌మి బాట‌లో ప‌య‌నిస్తున్నారు.. ఇక బీజేపీతో జ‌తక‌ల‌సి పోటీ చేసిన అన్నాడీఎంకే రెండో స్థానంలో కొన‌సాగుతున్నది. ఆ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 72 చోట్ల లీడ్‌లో ఉండ‌గా, అధికార డీఎంకే 51 స్థానాల్లో మాత్ర‌మే ఆధిక్యంలో ఉంది. త‌మిళనాడులో హంగ్ దిశ‌గా ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి.. మ్యాజిక్ ఫిగ‌ర్ 118 సీట్లు ఏ పార్టీ గాని, కూట‌మిగాని తొలి ట్రెండ్స్‌లో క‌నిపించ‌డం లేదు.. డీఎంకే అధికారం నిలుబెట్టుకుంటుంద‌ని స‌ర్వేలు వ‌చ్చినా.. వాస్త‌వంలో అవి త‌ప్పు అని తేలుతున్నాయి.. అనూహ్యంలో సినీ హీరో విజ‌య్ స్థాపించిన టీవీకే పార్టీ ఈవీఎంల లెక్కింపులో అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ 106 స్థానాల‌లో ఆధీక్యంలో నిలిచింది.. ఇక్క‌డ అన్నా డిఎంకె, టివికె పార్టీల మ‌ధ్య హోరాహోరి పోరు కొన‌సాగుతున్న‌ది.

ఈవీఎంల‌లో టీవీకే జోరు

ఈవీఎంల లెక్కింపులో డిఎంకే వెనుకంజ వేసింది. సినీ హీరో విజ‌య పార్టీ టివికె 106 స్థానాల‌లో లీడింగ్‌లో కొన‌సాగుతున్న‌ది.. డిఎంకె పార్టీ 57 స్ధానాల‌లో లీడ్ లో ఉండ‌గా, అన్నా డిఎంకె, బిజెపి కూట‌మి 69 చోట్ల ముందంజ‌లో ఉంది.. డిఎంకె పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరులో వెనుకంజ‌లో ఉన్నారు. ఇక్క‌డ ఎఐడిఎంకెకు చెందిన‌ సంతాన కృష్ణన్ పై లీడింగ్ లో ఉన్నారు.. డిఎంకె అభ్య‌ర్ధి, ఉప ముఖ్య‌మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెపాక్ స్థానంలో కూడా వెనుక‌బ‌డ్డారు.

విజ‌య్ ముందంజ‌..

టివికె పార్టీ అధినేత విజ‌య్ ఈ ఎన్నిక‌ల‌లో రెండు స్థానాల‌లో పోటీ చేశారు.. రెండు రౌండ్ ముగిసేనాటికి కోచ్చి ఈస్ట్ లో ఆయ‌న వెనుక‌బ‌డ్డారు.. ఇక డీఎంకే కంచుకోట పెరంబూర్ లో విజయ్ భారీ ఆధీక్యంతో ఉన్నారు.. ఇక్కడ తన సమీప ప్రత్యర్థి, డీఎంకేకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ డీ శేఖర్ పై ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.. మూడో రౌండ్ ముగిసే నాటికి విజ‌య్ 9 వేల ఓట్ల ఆధీక్యంలో ఉన్నారు.

స్టాలిన్ తో స‌హా 28 మంత్రులు వెనుకంజ‌

టివికె పార్టీ డిఎంకెకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. ముఖ్య‌మంత్రి స్టాలిన్ తో స‌హా ఆయ‌న మంత్రి వ‌ర్గంలో 28 మంది మంత్రులు ప్ర‌స్తుతం టెండ్స్ ప్ర‌కారం వెనుకంజ‌లో ఉన్నారు. డిఎంకె ఈ ఎన్నిక‌ల‌లో మూడో స్థానానికి ప‌డిపోయింది.ఇక అన్నా డిఎంకె అభ్యర్థి, మాజీ ముఖ్య‌మంత్రి ప‌ళ‌నీ స్వామి గెలుపు దిశ‌గా సాగుతున్నారు.. బిజేపీ అభ్యర్థి, తెలంగాణకు గతంలో గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందర్ రాజన్ వెనుకంజలో ఉన్నారు. పలు జిల్లాల్లో టివికె అభ్యర్థులు ఆధిక్యతలో ఉండగా.. ఆ పార్టీకి అన్నా డిఎంకె వారికి గట్టి పోటీ ఇస్తోంది. దీంతో చెన్నై పనైయూర్ లోని టీవీకే కార్యాలయం వద్ద కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విజయ్ అభిమానుల కోలాహలం నెలకొంది. పార్టీ ప్రాంగణంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. విజయ్ కు జిందాబాద్ కొడుతూ కనిపించారు పార్టీ నాయకులు. అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లు రావ‌డంతో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

పోస్ట‌ల్ బ్యాలెట్స్ లో.

తమిళనాడులో మొత్తం సీట్లు 234కాగా.. మ్యాజిక్ ఫిగర్ 118. ముందుగా లెక్కించిన పోస్ట‌ల్ బ్యాల‌ట్స్ లో డిఎంకె కూట‌మి ఏకంగా 164 స్థానాల‌లో లీడింగ్ సాధించింది.. ఇక బిజెపితో జ‌త‌క‌ట్టిన అన్నా డిఎంకె పార్టీ 70 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఇక హీరో విజ‌య స్థాపించిన పార్టీ టివికె ఆరు స్థానాల‌లో ముందంజ‌లో ఉంది.. అయితే ఈవిఎంల లెక్కింపుతో విజ‌య్ పార్టీ భారీ అధీక్యం దిశ‌గా దూసుకుపోతున్న‌ది.

CLICK HERE TO READ modi | వైరల్‌ అవుతున్న బీజేపీ ఇండియా మ్యాప్ పోస్ట్

CLICK HERE TO READ MORE