ఆడపడుచుల చదువు అవనికి వెలుగు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఆడపడుచుల చదువు అవనికి వెలుగని ప్రతి మహిళ చదువుకొని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవాలని ఊట్కూర్ ఐకెపిఏపిఎంవనితకుమారి అన్నారు. ఆదివారం నారాయణపేటజిల్లాఊట్కూర్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉల్లాస్ నవభారత్ ఆధ్వర్యంలో మహిళలకు అక్షరాస్యత పెంపొందించేందుకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ సంతకం చేసేలా చదువుకోవాలని, మహిళలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందనిఅన్నారు.
సమాజ అభివృద్ధి మహిళల అక్షరాస్యత పైన ఆధారపడిఉందన్నారు. ఆడపిల్ల చదువు దేశానికి వెలుగు అని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం సంతకం చేసేలా అక్షరాస్యత పైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు.
స్వయం ఉపాధి పొందేందుకు ప్రతి మహిళ చదువుకొని కుటుంబాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. మనం చదువుకోవడమే కాకుండా ఇతరులకు చదువు విలువ తెలుపలని గుర్తు చేశారు. చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మహిళల చదువు అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
