మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా రాజశేఖర్ రెడ్డి
మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా రాజశేఖర్ రెడ్డి
మక్తల్ , ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీ నుండి బిజెపి తరఫున గెలుపొందిన కౌన్సిలర్ల సమావేశం ఇవాళ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ కొండయ్య నివాసంలో జరిగింది .ఈ సందర్భంగా మక్తల్ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా 1వ వార్డు నుండి గెలుపొందిన బి.రాజశేఖర్ రెడ్డిని ఎన్నుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా 4వ వార్డు నుండి గెలుపొందిన పీకే. నరసింహను ఎన్నుకున్నారు వీరిని 2వ వార్డు నుండి గెలుపొందిన టప్ప కృష్ణ ప్రతిపాదించారు .సోమవారం జరగనున్న మున్సిపల్ బడ్జెట్ సమావేశం, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపిక చేపట్టారు. అదేవిధంగా ఇతర అంశాలపై చర్చించడం జరిగింది పాలకవర్గం చర్చ సందర్భంగా పాలకవర్గం మంచి పనులు ప్రతిపాదించిన సందర్భంలో అభినందించడం ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడం చేయాలని సూచించడం జరిగింది.
పాలకవర్గం అనుసరించే అంశాలపై ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం బిజెపి సభ్యులు పాటుపడాలని ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కొండయ్య సూచించారు .బిజెపి ఫ్లోర్ లీడర్ గా ఎంపికైన బి.రాజశేఖర్ రెడ్డి,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపికైన పీకే నరసింహ లను అదేవిధంగా 2వ వార్డు కౌన్సిలర్ టప్ప కృష్ణ లను ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కొండయ్య పార్టీ కండువాలతో సన్మానించి అభినందించారు .ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మున్సిపల్ లో పనిచేసి ప్రజల మన్ననులు పొంది పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
