611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha News
611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha News
- ఇక కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన పని లేదు
- ఆన్ లైన్ కౌన్సెలింగ్
- సోమవారం నుంచి షురూ
- ఉదయం 11.00 గంటలకు షురూ
- తొలుత ఆప్షన్ల స్వీకరణ
- ఆన్‌లైన్‌లోనే పోస్టింగ్స్!
- 34 గంటల్లో పోస్టింగ్ ఆర్డర్స్..
- ఏపీలో కొత్త రికార్డు
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)
ఏపీలో మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని తొలిసారిగా ఆన్ లైన్ కౌన్సెలింగ్ లో నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు అత్యంత పారదర్శక విధానంలో పోస్టింగ్ ఉత్తర్వులను అందజేస్తున్నట్టు మంత్రి వివరించారు. ఏపీ ఆన్ లైన్ సహకారంతో సోమవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి 34 గంటల్లోగానే పోస్టింగ్ ఉత్వర్వుల జారీ ప్రక్రియ ముగుస్తుందని మంత్రి తెలిపారు. అభ్యర్థుల ఆప్షన్ల కు అనుగుణంగా 611 డాక్టర్లకు ఆటోమేటిక్ గా పోస్టింగు ఉత్తర్వులను ఆన్ లైన్ లో అందజేస్తామని ప్రకటించారు ప్రభుత్వ నిబందనలు అనుసరించి (రిజర్వేషన్, ఇతర) అభ్యర్థులకు పోస్టింగులు ఇస్తామని తెలిపారు.
611 Doctors Postings : గతంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా..!
గతంలో జూమ్ కాన్ఫరెన్స్ విధానంలో ప్రకటిత ఖాళీలకు అనుగుణంగా పోస్టింగులు పొందారు స్థానికం ప్రాంతాల నుంచే కాకుండా కౌన్సెలింగ్ కేంద్రాలకు అభ్యర్థులు వెళ్లి అక్కడ ప్రకటించిన వివరాల మేరకు పోస్టింగులు పొందారు. ఈ విధానంలో ఎక్కువ సమయం పడుతుంది. నిర్వహణ ఏర్పాట్లు పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. ఈ విధానానికి భిన్నంగా.. అభ్యర్థులకు సానుకూలంగా ఉండేలా..పారదర్శకత మరింత పెరిగేలా ఇన్ లైన్ కౌన్సెలింగ్ జరగబోతుంది.
611 Doctors Postings : ఎక్కువ ఆప్షన్ లు మంచిది
ఆసుపత్రుల వారీగా ప్రకటించిన పోస్టులన్నింటికి ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు అప్షను ఇచ్చుకోవాల్సి ఉంది. ఇందులో ఎటువంటి పరిమితులు లేవు. దీనికి అనుగుణంగా అభ్యర్ధులు ఆప్షన నమోదు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు, బోధనాసుపత్రుల్లో ట్యూటర్ల కేటగిరిల్లో కలిపి మొత్తం 638 ) పోస్టులకు ఎంపికచేసిన డాక్టర్ల జాబితాను ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నియామకాల బోర్డు ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం పలు పోస్టులు పెరిగాయి. ఇలా మొత్తం 638 పోస్టుల్లో 124 ట్యూటర్ల పోస్టులు ఉన్నాయి. వెరిఫికేషన్ చేయాల్సి ఉన్నందున స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టులు మినహాయించి, మిగిలిన 611 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి సోమవారం ఉదయం 11 మంగళవారం సాయంత్రం 6 గంటల మధ్య (మొత్తం 31 గంటలు) అప్షన్లు స్వీకరిస్తారు. అనంతరం రెండు, మూడు గంటల వ్యవధిలో సదరు ఆసుపత్రుల పేర్లతో అభ్యర్థులు నమోదుచేసిన మొయిళ్లకు పోస్టింగు ఉత్తర్వులు ఆటోమేటిగ్గా వెళ్తాయి. పోస్టింగు ఉత్తర్వులు పొందిన డాకర్టర్లు సదరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కార్యాలయాలు, బోధనాసుపత్రుల్లో 15 రోజుల్లోగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి తెలిపారు. సీహెచ్ఎఫ్ డబ్ల్యూ, డీఎంఈ, రిక్రూట్ మెంటు బోర్డు వెబ్ సైట్ లో పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులకు సోమవారం ఉదయం 11 గంటల నుంచి లాగిన్(((https://aphfw-rec.aptonline.in))) కు అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించారు.
