బెల్లంపల్లిలో ఘనంగా తెలుగుదేశం ఆవిర్భావ వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, పేదల పెన్నిధి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం, అనుబంధ కార్మిక సంఘం టీఎన్‌టీయూసీ కార్యాలయాల్లో పసుపు జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేసి కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 44 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పసుపు జెండా ప్రతీకగా నిలుస్తోందన్నారు. పార్టీ ఆవిర్భావ స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంగా ముందుకు సాగాలని, ప్రతి తెలుగువాడు గర్వపడేలా వాడవాడలా పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల్లో మమేకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎల్‌యూ ఉపాధ్యక్షులు గద్దల నారాయణ, నాయకులు పాంటేల శంకరయ్య, అంబాల మచ్చయ్య, ఆర్. గంగాధర్ గౌడ్, పెద్ది రాము, గజ్జల దుర్గయ్య, గైన తిరుపతి, ఏ. కుమార్, ఎస్.ఎస్. పాండే, సిహెచ్ ప్రకాష్, హరికిషన్ పాండే, పుల్లూరి పోశం, మోసాది గోపాల్, బొల్లు సత్యనారాయణ, ఎస్.కె. అస్గర్ బాషా, గుండెటి శంకర్, ఎం. వెంకటస్వామి, కొత్తూరి నారాయణ, మేకల రాజయ్య, షబానా బేగం, పోతురాజుల రాములు, కీర్తి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply