CRIME | మద్యం మత్తులో అత్త ను చంపిన అల్లుడు…

CRIME | మద్యం మత్తులో అత్త ను చంపిన అల్లుడు…

కత్తితో నాలుగు పోట్లు పొడిచిన వైనం..
అక్కడికక్కడే కుప్పకూలిన మహిళ..
అల్లుడే అత్తకు కాలయముడయ్యాడు.
పరారీలో నిందితుడు..
గ్రామంలో విషాదం..

CRIME | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలో కడమల కాలువ గ్రామంలో అర్ధరాత్రి మహిళను దారుణంగా కత్తిపోట్లు తో పొడిచిన సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలుపుతున్నారు. అల్లుడే అత్తకు కాల యముడు కావడం గ్రామంలో సంచలనం కలిగిస్తుంది.పోలీసులు తెలిపిన కథనం మేరకు శనివారం అర్థరాత్రి భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. కత్తితో భార్య ఎస్తేరు రాణి ని కత్తితో పొడవడానికి ప్రయత్నం చేశాడు. పక్క వీధిలో ఉంటున్న తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సునీల్ అత్తగారింటికి వెళ్లి నా కొడుకును నాకివ్వు అంటూ బూతు పదజాలంతో అత్త కళావతిని తిట్టాడు. ఉదయం పంపిస్తాము వెళ్ళిపోరా అనింది అని పోలీసులు తెలుపుతున్నారు.

CRIME

టైంలో మద్యం మత్తులో ఉన్న సునీల్ అత్త కళావతిని నాలుగు సార్లు కత్తితో పొడిచాడు. ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అంబులెన్స్ వాహనంలో తరలించిన దారి మధ్యలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు.గ్రామానికి చెందిన సునీల్ భవనాలకు పెయింటింగ్ వర్క్ పనిచేస్తుంటాడు. సునీల్ అదే గ్రామానికి చెందిన ఎస్తేరు రాణిని ఐదు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నా రు. రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడని పోలీసులు తెలుపుతున్నారు. శనివారం రాత్రి కూడా పూర్తిగా మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు.మద్యం మత్తులో అత్త కళావతిని కత్తితో పొడిచి చంపిన సంఘటన గ్రామంలో కలకలం రేపింది. కళావతికి భర్త గతంలోనే మరణించారు. పిల్లలను పోషించుకుంటూ కళావతి ని కత్తితో పొడిచిన సంఘటన గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Leave a Reply