Akkineni Akhil | లెనిన్ నిర్ణయం సరైనదేనా…?
Akkineni Akhil | లెనిన్ నిర్ణయం సరైనదేనా…?
Akkineni Akhil | లెనిన్ రిలీజ్ వాయిదా.. అభిమానుల నిరాశ
జూన్ 26 డేట్ పై పెరుగుతున్న అసంతృప్తి
అఖిల్ కెరీర్ కు కీలకమైన నిర్ణయం
నాగార్జున గైడెన్స్ పై ఫ్యాన్స్ ఆవేదన
Akkineni Akhil | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమాని మే 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆతర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుందని.. అనౌన్స్ చేయడంతో లెనిన్ సైలెంట్ అయ్యాడు. లేటెస్ట్ గా లెనిన్ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ చూసిన అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇంతకీ.. లెనిన్ వచ్చేది ఎప్పుడు..? ఎందుకు అభిమానులు నాగార్జున, అఖిల్ పై ఫైర్ అవుతున్నారు..?
Akkineni Akhil | అలా జరగడం లేదు..

అఖిల్ లెనిన్ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 1 రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో సమ్మర్ లో సరైన టైమ్ కి వస్తుందని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే.. అభిమానులకు ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండలేదు. పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ అని ప్రకటించేసరికి ఒక రోజు గ్యాప్ లో అఖిల్ లెనిన్ సినిమాని రిలీజ్ చేయరనే విషయం అర్థమైంది. అయితే.. పెద్ది వచ్చిన రెండు వారాలకు అయినా లెనిన్ వస్తుందని.. అది కుదరకపోతే.. నెల రోజుల గ్యాప్ తర్వాత అయినా మే నెలాఖరుకు లెనిన్ రావడం ఖాయం అనుకున్నారు అభిమానులు కానీ.. అలా జరగడం లేదు.
Akkineni Akhil | ఇంత గ్యాప్ అవసరమా..?

అయితే.. జూన్ 26న లెనిన్ మూవీ రిలీజ్ కానుందని.. ప్రకటించారు మేకర్స్. ఈ ప్రకటనే అక్కినేని అభిమానులకు కోపం తీసుకువచ్చింది. విషయం ఏంటంటే.. పెద్ది కోసం త్యాగం చేసినా.. రెండు నెలల గ్యాప్ ఇవ్వడం ఎందుకు..? నెల రోజులు గ్యాప్ తర్వాత మే నెలాఖరున అయినా రిలీజ్ చేయచ్చు కదా.. అఖిల్ ఒక్క సినిమాని కూడా సరిగా ప్లాన్ చేసుకోవడం లేదు అని మండిపడుతున్నారు. అభిమానుల ఆవేదనలో ఆర్ధం ఉందనిపిస్తుంది. అయితే.. అఖిల్ కి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఇప్పుడు కంగారుపడి రిలీజ్ చేయడం కంటే.. సోలో డేట్ లో రిలీజ్ చేయడం ముఖ్యం.
Akkineni Akhil | ఏజెంట్ రిలీజై మూడేళ్లు..

జూన్ 26న లెనిన్ రిలీజ్ అంటే.. ఐపీఎల్ గోల ఉండదు. సమ్మర్ హడావిడి తగ్గుతుంది. రిపేర్లు చేసుకోవడానికి కావాల్సినంత టైమ్ దొరుకుతుంది. ఇవన్నీ ఆలోచించే.. ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఇది అఖిల్ కెరీర్ కి మంచి నిర్ణయమనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. అఖిల్ సినిమా ఏజెంట్ రిలీజై మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ నుంచి కొత్త సినిమా రాలేదనే కోపం, బాధ అభిమానుల్లో ఉంది. అలాగే అన్ని తెలిసిన నాగార్జున కూడా సరిగా గైడ్ చేయడం లేదేంటి అనే ఆవేదన ఉంది. అందుకనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా.. లేట్ అయినా.. లేటెస్ట్ గా వచ్చి అఖిల్ బ్లాక్ బస్టర్ సాధించాలనేదే అభిమానుల కోరిక. మరి.. లెనిన్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
