Just-18Hrs : నేపాలీ పీఎం తొలి షాక్ Andhra Prabha Latest News

Just-18Hrs : నేపాలీ పీఎం తొలి షాక్ Andhra Prabha Latest News
మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్
మాజీ హోంమంత్రి సైతం
బాధ్యతలు స్వీకరించిన 18 గంటల్లోనే అరెస్టులు
నేపాల్‌లో సంచలనం
( ఆంధ్రప్రభ, ఖాంట్మండు ప్రతినిధి )

నేపాల్ రాజకీయ చరిత్రలోనే ప్రధానిగా నవ యవ్వన నేత బాలేంద్ర షా
ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే.. కరుడుగట్టిన కమ్యేనిస్టు నేత
మాజీ ప్రధాని, ఆయన సహచరుడు మాజీ హోంమంత్రిని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు ప్రక్రియతో నేపాల్ లోనే కాదు.. భారతదేశంలోని నేపాలీల్లోనూ తీవ్ర సంచలనం రేపింది. గత ఏడాది దేశంలో నిరుద్యోగం., మితిమీరిన ద్రవ్యోల్బణం, ప్రభుత్వంపై అవినీతి అక్రమ ఆరోపణలతో నేపాలీ యువజనం దండెత్తిన ఘటనలో.. అప్పటి ప్రధాని ఆదేశాలతో పేపాలీ పోలీసులు అణిచివేతను ప్రయోగించారు.

ఈ ఉద్రిక్త వాతావరణంలో సుమారు 76 మంది మృతి చెందగా.. 2300 మంది గాయపడ్డారు. ఆందోళన కారులపై సర్కారు యోగించిన అణిచివేతకు వ్యతిరేకంగా.. తాజా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తన ప్రభుత్వాన్ని కూలదోసి, కొత్త ఎన్నికల కోసం హింసాత్మక నిరసనలు చేపట్టిన ఆందోళనకారులపై స్రభుత్వం పోలీసు బలాన్ని ప్రయోగగించింది. ఈ ఘటనల్లో చోటు చేసుకున్న మారణహోమంపై నేపాల్ పోలీసులు శనివారం తెల్లవారుజామున మాజీ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీని అరెస్టు చేశారు.
Just-18Hrs : అనూహ్య అరెస్టులు

ఈ శక్తివంత కమ్యూనిస్ట్ నాయకుడిని రాజధాని ఖాట్మండు శివార్లలోని ఆయన నివాసంలో అధికారులు అరెస్టు చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపాలని అధికారులను ఆదేశించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను కూడా అరెస్టు చేశారు. తాజా హోం మంత్రి సుడాన్ గురుంగ్ ఈ అరెస్టులను దృవీకరించారు. ఇది ప్రతీకారం కాదు, ఇది కేవలం న్యాయానికి నాంది మాత్రమే. ఇప్పుడు దేశం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటుందని నమ్ముతున్నాను.” అని సుడాన్ గురుంగ్ స్పష్టం చేశారు.
Just-18Hrs : విచారణ కమిషన్ ఆదేశం

తాజా ప్రభుత్వం ఇటీవల ఈ ఘటనలపై విచారణకు ఓ కమిషన్ నియమిచింది. తన విచారణలో మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి లేఖక్ , నాటి పోలీస్ చీఫ్‌ను నింధితులుగా కమిషన్ గుర్తించింది. ఈ ముగ్గురికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని తన నివేదికలో కమిషన్ కోరింది. నేపాలీ అగ్రనేతలను అరెస్టు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ట్రక్కుల్లో చేరుకున్నారు. వారిద్దరినీ ఇళ్ల దగ్గరే అరెస్టు చేసి, ఖాట్మాండు జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. .
రాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా నేతృత్వంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నెలరోజుల కిందట భారీ విజయం సాధించింది. ఆయన నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక రోజు వ్యవధిలోనే ఈ అరెస్టులు జరిగాయి. ఈ దారుణ మారణకాండలో మృతులు, క్షతగాత్రులకు న్యాయం చేస్తామని ప్రధాని బాలేంద్ర షా, హోమంత్రి గురుంగ్ హామీ ఇచ్చారు.
Just-18Hrs : అదొక మారణ కాండ

నేపాల్ ప్రభుత్వం అవినీతి, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా యువత ఆగ్రహంతో సెప్టెంబర్ 8-9 తేదీలలో నిరసనలకు దిగారు. ఈ నిరసనలను పోలీసులు అణచివేతకు దిగారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారటంతో 76 మంది మరణించగా, 2,300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గుంపులు ప్రధానమంత్రి, రాష్ట్రపతి కార్యాలయాలను, పోలీస్ స్టేషన్లను, అగ్రశ్రేణి రాజకీయ నాయకుల ఇళ్లను తగలబెట్టారు. ఈ స్థితిలో ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు సైనిక హెలికాప్టర్లలో పారిపోక తప్పలేదు. “జెన్ జెడ్” కార్యకర్తల ప్రదర్శనల ఫలితంగా, సెప్టెంబర్ 12న నేపాల్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా సుశీల కర్కి నియమితులయ్యారు. ఎన్నికలకు ముందు జరిగిన పరివర్తన కాలంలో ఈమె సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
ALSO READ : 8 Hours custody : అడ్డంగా… గోల్ఫ్ పులి Andhra Prabha Sports News
