IND vs PAK | కోహ్లీని ఊరిస్తున్న వ‌ర‌ల్డ్ రికార్డు !

టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన మైలురాయికి ఊరిస్తొంది. ఈరోజు (ఆదివారం) పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి 15 పరుగులు చేస్తే… దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు.

విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 298 వ‌న్డేలు ఆడాడు. 286 ఇన్నింగ్స్‌ల్లో 57.8 స‌గ‌టుతో 13985 ప‌రుగులు చేశాడు. ఇందులో 50 సెంచ‌రీలు, 73 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. స‌చిన్ 14వేల పరుగుల మైలురాయిని 350 వ‌న్డే ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ 15 ప‌రుగులు చేస్తే 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధిస్తాడు.

ఇక వ‌న్డేల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మాత్ర‌మే 14వేల కంటే ఎక్కువ ప‌రుగులు చేశారు. ఈ జాబితాలో 18,426 ర‌న్స్‌తో స‌చిన్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు కుమార సంగ‌క్క‌ర 14,234 ప‌రుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఈ జాబితాలో మూడో ఆట‌గాడు కానున్నాడు.

వ‌న్డేల్లో 14000+ర‌న్స్‌ చేసిన ఆట‌గాళ్లు వీరే..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 18,426 ప‌రుగులు
కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక‌) – 14, 234 ప‌రుగులు.

కాగా, నేటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు.. 49.4 ఓవర్లకు 241 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో సెమీస్ బెర్త్ లక్ష్యంగా 242 పరుగుల టార్గెట్ తో టీమిండియా చేజింగ్ ప్రారంభించనుంది.

Leave a Reply