ViratKohli| ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..?
ViratKohli| ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నెట్టింట్లో ఫేమస్ కావడానికి కొందరు ఎంతకైనా తెగిస్తారు. లైకుల కోసం వింత చేష్టలు చేస్తుంటారు. కొందరు రీల్స్ పిచ్చితో డేంజరస్ స్టంట్స్ కూడా చేస్తుంటారు. మరికొందరు వారు చేసే పిచ్చి పనులకు అవతలివారికి ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఫేమస్ వ్యక్తుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా పాపులర్ అవుతామని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి వాటి వల్ల ఇబ్బందుల పాలవుతామని గుర్తించారు. తాజాగా ఓ యువతి చేసిన ఇలాంటి ఓ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేమిటంటే..
ఓ అమ్మాయి విరాట్ కోహ్లీకి ఉన్న ఫేమ్‌ను ఉపయోగించుకొని తను ఫేమస్ అవుదామని చూసింది. ఆమె తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి విరాట్ కోహ్లీ అని చెప్పి షాక్ ఇచ్చింది. అంతే కాదు విరాట్ తనకు లవ్ బైట్ ఇచ్చాడు అని కూడా చెప్పుకుంటూ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ పాపులారిటీ కోసం మా అభిమాన క్రికెటర్ పేరు చెడగొడతావా.? అంటూ ఫైర్ అవుతున్నారు
వీడియో కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి
https://www.instagram.com/cricminaati/reel/DWS36jzAF-I
