ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి..

ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఓబీసీ సమస్యల పైన ఈ నెల 30, 31 తేదీలలో నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘం నాయకులు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ కోరారు. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీసీ నాయకులతో కలిసి ఆయన ఛలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రంను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ ల ఆధ్వర్యంలో బీసీ సమస్యల పరిష్కారం కోసం జాతీయ సెమినార్, జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, జన గణనలో కుల గణన చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త బెల్లి చంద్రశేఖర్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకల శ్రీనివాస్, దాసరి లవ్లేష్, దాసరి శ్రీనివాస్, గోగు లింగం, బెల్లి మధుకర్, మహేష్, నరారి మల్లేష్, వీరయ్య, సైదుల్ గౌడ్, విగ్నేష్, సత్తయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply