నగరంలో పేలుడు పదార్థాల నిల్వ

నగరంలో పేలుడు పదార్థాల నిల్వ
బీరన్నకుంటలో ప్రమాదకర పేలుడు పదార్థాల పట్టివేత
ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మహిళ
జిలెటిన్ స్టిక్స్,డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ సీజ్
వరంగల్ క్రైమ్,ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేశారు. ఎటువంటి అనుమతులు పొందకుండానే జిలెటిన్ స్టిక్స్,డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్స్, కార్డేస్ వైర్ బిండల్స్ ను జనవాసాల మధ్య ఉన్న ఇంట్లోనే మహిళ నిల్వ చేశారు.ఈ అంశంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకొన్నారు.టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎలిగేటి మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ బాబులాల్ సారథ్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరన్నకుంటలోని శివరాత్రి అనిత (38)తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేశారు. 41 జిలిటీన్ స్టిక్స్, 80 డితోనేటర్స్, 17 కార్డేస్ వైర్ బండిల్స్, 5 అమ్మోనీయం నైట్రేట్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.21 వేల 450 రూపాయల విలువైన వాటిని పట్టుకొని లోకల్ పోలీసులకు అప్పగించారు.తదుపరి విచారణ కోసం నిందితురాలిని మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
