అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల పట్ల అప్రమత్తత, ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రదర్శన పూర్వక అవగాహన కల్పించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ స్వప్న రాథోడ్ తో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక శాఖకు చెందిన ఉద్యోగులు కె శ్రీనివాస్, వి నరేష్, ఏ మల్లేశం, ఎన్ కరుణాకర్ పాల్గొన్నారు.

Leave a Reply