రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో…
రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో…
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఏజెన్సీలో రోడ్లు వంతెనలు నిర్మించాలని డిమాండ్ తో గురువారం బంజారా హక్కుల సంరక్షణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్ చవాన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్, ప్రజా సంఘాల నాయకులు గురువారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాపూర్ మంతెన ప్రధాన రోడ్డుపై రాస్తారోకో, ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భరత్ చవాన్ మాట్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఎక్స్ రోడ్ నుండి అసిఫాబాద్, బ్రిడ్జిలు దంతన్ పెళ్లి, కె.బి కాంప్లెక్స్ నాగపూర్, షాంపూర్ ఏందా కాలనీ, ఈశ్వర్ నగర్, ఇంద్రవెల్లి జిన్నింగ్ దగ్గర మొత్తం కలిపి ఎనిమిది బ్రిడ్జిలు వెంటనే నిర్మాణం చేసి ప్రజల ప్రణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో ధర్నా విషయo తెలుసుకొని ఉట్నూర్ ఐటిడిఏ పిఓ యువరాజ్ మర్మాట్ స్పందించి భరత్ చౌహన్ తో ఫోన్లో మాట్లాడి ఆర్ అండ్ బి అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలతో చర్చించి తప్పకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
పిఓ హామీ మేరకు ధర్నా,రాస్తారోకో కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సయ్యద్ రషీద్, కాటం రమేష్, ముకుందరావు, జాంబ్లీ పాండు, రంగన్న, సన్నీ జాదవ్, సుభాష్ ఆడే, సుభాష్, అంబర్ సింగ్ మహారాజ్ ఆనంద్ రావు మహారాజ్, మరప బాలాజీ, సిదాం, విజయ్, ఇంద్రు, ధన్రాజ్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
