అధ్వానంగా మారిన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ…

అధ్వానంగా మారిన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ…

సమస్యలను పట్టించుకోని డిప్యూటీ కమిషనర్….

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలో గుండ్ల పోచంపల్లి నుండి మైసమ్మగూడ వెళ్లే ప్రధాన రోడ్డులో దొమ్మ నరసింహ ఇంటి వద్ద మ్యాన్ హోల్ కూలిపోయి వాహనదారులు చాలా అవస్థలు పడుతున్న పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారులు, ఇట్టి రోడ్డు నుండి మైసమ్మగూడ మల్లారెడ్డి కాలేజీ వరకు, అప్పారెల్ పార్క్, కంపెనీలకు చాలామంది రాకపోకలు సాగిస్తా ఉంటారు.

ఈ మ్యానువల్ గతంలో చాలా సార్లు చెడిపోయిన తూతూ మంత్రంగా రిపేర్ చేయడం జరుగుతుంది. సిమెంటుతోని ఏర్పాటుచేసిన మ్యానువల్ కవర్ మొత్తం వాహనాల రాకపోకలతో కూలిపోయింది. గతంలో దీనికన్నా ముందు రోడ్డు లో ఇదే పరిస్థితి ఏర్పడితే అప్పటి మున్సిపల్ అధికారులు పట్టించుకోని అక్కడ ఇనుప మాన్యువల్ వేయడం జరిగింది. అక్కడ సమస్య పూర్తిగా పరిష్కరించిన తర్వాత ఇప్పుడు. తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిహెచ్ఎంసి సిబ్బంది మాత్రం టాక్స్ కలెక్షన్ లో మీద ఉన్న శ్రద్ధ ఒక మాన్యువల్ చెడిపోతే పట్టించుకోని దుస్థితిలో ఉన్నారు.

అలాగే గుండ్ల పోచంపల్లి నుండి కొంపల్లి వెళ్లే దారిలో హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గర రోడ్డు పైన లోపటికి కారు వాహనాలు వెళ్లకుండా రోడ్డుపైన మాన్యువల్ కట్టడం జరిగింది. ఇట్టి కట్టడం గురించి డిప్యూటీ కమిషనర్ దృష్టి ఎన్ని సార్లు తీసుకువచ్చినా దానిపైన ఇప్పటివరకు కనీసం చర్యలు తీసుకోలేదు. పాత మున్సిపల్ ఆఫీసు కు కూతవేటు దూరంలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు కొంచెం దూరం పూర్తిగా చెడిపోయి గుంతల మాదిరిగా తయారైంది.

గతంలో మున్సిపల్ ఉన్నప్పుడు అప్పటి నాయకులు మున్సిపల్ సిబ్బంది తక్షణం స్పందించి పనులు వేగవంతం చేసేవారు. కానీ జిహెచ్ఎంసి లో కలిసిన తర్వాత టాక్స్ వసూలు పైనే దృష్టి పెట్టి తిరుగుతున్నారు. ఎటువంటి పనులు చేయడం లేదు. సమస్యలు పరిష్కరించడం లేదు.ఎవరికి చెప్పాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా స్పందించి దయచేసి అధికారులు ఈ మూడు పనులను చేపించగలరని జిహెచ్ఎంసి అధికారులను కోవడం జరిగింది.