ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి..

ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి..
- ఆలస్యం చేయకండి
- ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
- సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమావేశం
- హౌసింగ్ పీడీ మాతృ నాయక్
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా వెంట నే పనులు ప్రారంభించి పూర్తి చేసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న పథ కాలను సద్వినియోగం చేసుకుని ప్రతి కుటుంబం సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని హౌసింగ్ జిల్లా అధికారి మాతృ నాయక్ ఈ సందర్బంగా కోరారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ జిల్లా అధికారి మాతృ నాయక్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇళ్లు మంజూరు అయినప్పటికీ ఇంకా నిర్మాణం ప్రారంభించని లేదా మధ్యలోనే ఆలస్యం చేస్తున్న లబ్ధిదారులతో నేరుగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లుల విడుద లలో ఏమైనా జాప్యం ఉందా..? ఇసుక కొరత లేదా ఇతర నిర్మాణ సామగ్రి సమస్యలు ఉన్నాయా అనే విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలి: హోసింగ్ పీడీ మాతృ నాయక్
మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించుకోవాలని హోసింగ్ పీడీ మాతృనాయక్ సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం తో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధికా రులు సంతృప్తి వ్యక్తం చేసారు.
మిగితా పనులను వేగవంతం చేసి త్వర లోనే పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, లబ్ధిదారులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ చంద్రశేఖర్, ఎఈ అఖిల, ఉప సర్పం చ్ లింగనబోయిన రాజు, వార్డ్ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
