ఆర్థిక సవరణ బిల్లు పెన్షనర్లకు అన్యాయం..

ఆర్థిక సవరణ బిల్లు పెన్షనర్లకు అన్యాయం..
కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఓ పి ఎస్ పెన్షనర్లకు పొంచి ఉన్న పెను ప్రమాదం తొలగించండి…
జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం వచ్చిన విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వము గత ఏడాది మార్చి 25వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సవరణ బిల్లులో చేసిన సవరణలు వల్ల విశ్రాంత ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని వీటిని సరిదిద్దాలని ఏ పి ఎస్ జి ఆర్ ఈ ఏ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బరాయుడు పేర్కొన్నారు. బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్ల సవరణలు చేర్చి పార్లమెంటులో ఆమోదించడము జరిగిందన్నారు. ఒకసారి బిల్లు పాస్ అయితే రాష్ట్రపతి ఆమోదం పొందిన అది చట్టముగా రూపుదిద్దుకుంటుందన్నారు. గత ఏడాది మార్చి 25వ తేదీన గెజిట్ పబ్లికేషన్ చేసి జీవో గా ఇవ్వడం జరిగిందని ఇలా చేయటం తగదని దీనిలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ప్రధానమంత్రి మోడీ కి వినతి పత్రాన్ని పంపుటకు గాను జిల్లా కలెక్టర్ ద్వారా మెమరాండమును జాయింట్ కలెక్టర్ కు అందజేయడం జరిగినదన్నారు.
ఈ చట్టం అమలు అయితే కేంద్ర ప్రభుత్వానికి విశ్రాంతి ఉద్యోగులను వర్గీకరించే అధికారం వస్తుందన్నారు. ప్రస్తుతము ఓ పి ఎస్ పెన్షన్ పొందుతున్న వారికి ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి అమలు చేయబోతున్న 8వ సిపిసి నందు కమిషన్ ఇచ్చే రికమండేషన్ లకు అర్హులు కారన్నారు. అప్పుడు పే రివిజన్ సదుపాయము, పెన్షన్ పెరుగుదల ఉండదన్నారు. దీని మూలంగా చాలా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు . దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయవచ్చుఅన్నారు.వెలిడేషన్ చట్టం ప్రకారం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు.
అలాగే పెన్షనర్ల పితామహుడు న కా రా వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉందని నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో పదవీ విరమణ చేసిన పెన్షనర్ల నాయకులు ఆర్థిక కార్యదర్శి జిపి. వీరప్ప,చెన్నకేశవులు, లక్ష్మీనారాయణ, ఉస్మాన్ భాష, రామకృష్ణారెడ్డి, ప్రసాద రెడ్డి, తిరుపతయ్య, ఆచారి, ఆనందు, వెంకటరెడ్డి,జోజి రెడ్డి, దస్తగిరి ,కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
