దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి..

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి..
బస్సు పాసుల విషయంలో సానుకూలంగా న్యాయం చేయండి…
దివ్యాంగులు ఆర్టీసీ ఆర్ఎం కు వినతి…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం దివ్యాంగుల శక్తి పథకంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంలో దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి. మస్తాన్ వలి పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి వచ్చేత బస్సు పథకంలో జిల్లా స్థాయిలో అమలు చేయాలని ఆర్టీసీఆర్ ఎం రజియా సుల్తానా కు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో ఆర్టీసీ వారు కేటాయించిన బస్సు పాసుల తోనే ఉచిత ప్రయాణం కల్పించాలని, ఆర్ పి డబ్ల్యూ డి 2016 దివ్యాంగుల హక్కుల చట్టంలో పొందపరచిన విధముగా దివ్యాంగులకు కేటాయించిన సీట్లలోని దివ్యాంగులకు అవకాశం కల్పించాలనికోరారు.
దివ్యాంగుల రిజర్వేషన్ 4శాతం ప్రకారం దివ్యాంగులకు సీట్లు సంఖ్య పెంచాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో దివ్యాంగుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బస్సు పాసుల కౌంటర్ దగ్గరికి వెళ్ళుటకు దారి లేక దివ్యాంగులు ఇబ్బందుల్లో పడుతున్నారని తదితర సమస్యల పైన స్పందించి న్యాయం చేయాలని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానాను కోరారు.
దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని రజియా సుల్తానా హామీ ఇచ్చినట్లు పేర్కొన్న రు. ఈ కార్యక్రమంలో డిజేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, డిజేబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి జహీరుద్దీన్, సభ్యులు మనన్, ఖలీల్, వెంకటనారాయణ వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు జజ్జరి మరియదాసు తదితరులు పాల్గొన్నారు.
