అక్రమ అరెస్టులతో అణచివేయలేరు

అక్రమ అరెస్టులతో అణచివేయలేరు
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న బంజారా నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు ఆరోపించారు.బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఛలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నర్సింహులపేట మండల ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు ఉదయ నాయక్,సేవాలాల్ సేన నాయకులు రమేష్ నాయక్,వీరు నాయక్,శంకర్ నాయక్ లను స్థానిక పోలీసులు మందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.అనంతరం అరెస్ట్ అయిన నాయకులు మాట్లాడుతూ… హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం గిరిజన బిడ్డలేనని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిడం సిగ్గుచేటని మండిపడ్డారు.శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న మమ్ములను అక్రమంగా అరెస్టులు చేయడం పట్ల ధ్వజమెత్తారు.
