స్వామివారిని దర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్

స్వామివారిని దర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్

మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

అనంతరం ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు కొనకళ్ల నారాయణని సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

Leave a Reply