Short circuit | అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

Short circuit | అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

Short circuit | చల్లపల్లి, ఆంధ్రప్రభ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌(Short circuit)తో పూరిల్లు ద‌గ్ధ‌మైన ఘటన చల్లపల్లి మండలం, లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రామానగరం తోటవారి బజార్‌లో బడ్డీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వెలగం అనురాధకు చెందిన తాటాకు ఇంట్లో విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి. వెంటనే స్థానికులు స్పందించి అవనిగడ్డ అగ్నిమాపక‌(fire extinguisher) సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కొంతసేపటి తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చి పూర్తిగా మంటలను ఆర్పారు.

Short circuit |

ఇంట్లోని వ‌స్తువుల‌న్నీ మంటల్లో కాలిపోవడంతో అనురాధ ఆమె ఇద్దరు ఆడ పిల్లలు రోడ్డున పడ్డారు. భర్త లేకపోవడంతో బడ్డీ కొట్టు నడుపుకుంటూ ఉదయం టిఫిన్(tiffin) అమ్ముకొని జీవనం సాగిస్తున్న అనురాధకు పెద్ద కుమార్తె తల్లికి చేదోడువాదుడుగా ఇంటి దగ్గరే ఉంటుండగా.. చిన్న కుమార్తె ఇంటర్ చదువుతుంది. పాప ఫీజు కోసం వారాల వాళ్ల దగ్గర అప్పు తీసుకున్న రూ.15వేలు కూడా మంటల్లో కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.

Leave a Reply