మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ

మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ

సిర్పూర్ (యు ), ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం లో మొండి బకాయిల వసూళ్లు కొరకు మండల కేంద్రంలో మండల కేంద్రంలోని పలు కాలనీలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీఎం మైస రమేష్ ఆధ్వర్యంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు, మండలంలోని అన్ని విఓ ల నుండి విఓ అధ్యక్షులు, సీసీ లు, వీఓఏలు కలిసి సిర్పూర్ (యు )మండల సమాఖ్య ఆఫీస్ నుండి చౌరస్తా మీదుగా మహాదేవ్ నగర్, రాంనగర్, ఎస్సీ కాలనీ, ప్రెసిడెంట్ గూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇందులో బ్యాంకు, స్త్రీనిధి, సిఐఎఫ్ మొండి బకాయిలు ఉన్న వారికీ ఇంటి ఇంటికి వెళ్లి అవగాహనా కల్పిస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి, వడ్డీ లేని రుణాల గురించి అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమం లో ఏపీఎం మైస రమేష్, టీజీబీ మేనేజర్ గజేంద్ర సొలంకి,సీసీలు జైవంత్ రావు, లింగు,తుకారాం, రాధా, హన్మంతు,వీఓఏలు రవీందర్, విట్టల్, మండల సమైక్య అధ్యక్షురాలు ఆత్రం రాధ, విఓ అధ్యక్షులు రేణుక, చంద్రకళ, పర్వతాబాయి, పంచు బాయి, సిబ్బంది రాధా, సుఖదేవి ఐకెపి ఉద్యోగులు పాల్గొన్నారు.