నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం..

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఇటీవలే ఎన్నికైన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పొద్దుటూరి సతీష్ రెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన బుర్ర దేవేందర్ గౌడ్ కడెం లో ని హోటల్ బృందావన్ లో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తుమ్మల మల్లేష్ యాదవ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సత్కరించి పూలమాలలు వేసి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు కాంగ్రెస్ నేతలు వేరువేరుగా అందరూ శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కడెం మండలానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు కార్యదర్శులు గా నియమించినందుకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కి మండల కాంగ్రెస్ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా లో బలోపేతం కోసం కృషి చేస్తారాని జిల్లా నాయకత్వం పై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బరుపటి రమేష్ వర్మ సర్పంచ్ ఫోరమ్ మండల అధ్యక్షులు జొన్నల చంద్ర శేఖర్ మండల నాయకులు బొడ్డు గంగన్న సర్పంచ్ లు ఒడ్నాల శిరీష సత్యం చీమల భీమేష్ నర్సింగ్ అశ్విత రమేష్ బొంతల లక్ష్మి భూమన్న ఈదుల తిరుపతి మండల నాయకులు ముస్కు రాజేందర్ రెడ్డి కమలాకర్ తరి గంగాధర్ షేక్ రఫిక్ జి రాజన్న బబ్లు సలీం డి శేఖర్ తొట్ల గంగాధర్ షర్ఫుద్దీన్ తొట్ల ధర్మయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply