ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవ్వండి.

ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవ్వండి.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
పొందుగల గ్రామంలో ‘రైతన్నా మీకోసం’

మైలవరం, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు రైతులు ముందస్తుగా సన్నద్ధం కావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. మైలవరం మండలంలోని పొందుగల గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కింద సొమ్ము జమ అయిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతుతో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పర్చుకోవడమే రైతన్న మీకోసం ప్రధాన లక్ష్యమన్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని, వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఆ దిశగా డీప్ టెక్నాలజీ, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో పలు పదవులు పొందిన నాయకులు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని కలిసి కృతజ్ఞతలు తెలుపగా, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు ఉప్పు రాజగోపాల్ సోదరుని కుమార్తె జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని చిన్నారికి, వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.