5daysbreak | అక్కడ యుద్ధవిరామం…తీరేనా గ్యాస్ సంక్షోభం?
5daysbreak | అక్కడ యుద్ధవిరామం…తీరేనా గ్యాస్ సంక్షోభం?
5daysbreak | ఇరాన్ యుద్ధం – ప్రజల భయానక పరిస్థితి
గ్యాస్ కొరతతో భారత్‌లో ఆందోళన
ట్రంప్ విరామం – నిజంగా పరిష్కారమా?
కార్టూన్‌లో సగటు మనిషి ఆలోచన
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఎవరి బాధ వారిది….ఔను నిజమేమరి…పక్కోడి ఇల్లు కాలిపోతుందంటే, మంటలు మనింటి దాకా రాకుండా జాగ్రత్తపడే మనస్తత్వాలు కదా మనవి…అది మానవ సహజం…ఆమాత్రం స్వార్థమే లేకుంటే మనుషులమెట్లా అవుతాం మరి?
ఒక పక్క బాంబుల మోతలతో దద్దరిల్లిపోతున్న ఇరాన్….ఎక్కడ, ఎప్పుడే క్షణాన బాంబుల దాడిలో తమ ప్రాణాలు, తమవాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో తెలియని భీతావహ పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పాలకుల మధ్య బింకాలుండొచ్చు…కానీ ప్రజలు కోరుకునేది మాత్రం సాధారణమైన జీవన విధానాన్నే.
సరే అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధం పై మనకెందుకు? ప్రపంచమన్నాక ఎప్పుడూ ఎక్కడో చోట ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంటుంది అనుకోవచ్చు. కానీ, అక్కడి యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్-పెట్రోల్ ధరలు పెరుగుతుండడం, గ్యాస్ సిలిండర్లైతే అసలు డబ్బులు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్పడడమే మనోళ్ళను ఆందోళనకు గురి చేస్తున్న విషయం.
ఇప్పుడు ట్రంప్ యుద్ధానికి 5రోజుల విరామం అని ప్రకటించగానే మనమనసులో ఠక్కున పుట్టుకొచ్చే ప్రశ్న…”సిలెండర్ల కొరత తీరిపోనుందా?” అంటే ఈ ఐదు రోజుల వ్యవధిలోనే గబగబా కావలసినన్ని సిలెండర్లకు సరిపడా ఎల్ పీజీ తెచ్చేసుకుని భారత్ నిల్వ చేసుకోగలదా? ఒకవేళ ట్రంప్ మళ్ళీ అయిదు రోజుల తర్వాత యుద్ధం మొదలెట్టినా కూడా మనకు గ్యాస్ కొరత రాకుండా ఉంటే చాలు…
అదే మాట ఈ కార్టూన్ లోని ఇల్లాలు అనేసింది…పాపం తన మనసులోని బాధను బయట పెట్టేసింది. అవును మరి తెల్లారి లేచినప్పట్నుంచీ కాఫీలూ, టీలూ, టిఫిన్లూ, భోజనాలూ…ఎన్నిటికని చస్తాం? కడుపులో ఆత్మారాముడు గోలపెడితే మనం చూసేది మన వంటింటివైపే కదా…
కానీ అప్పుడే కథ అయిపోయినట్టేనా? గ్యాస్ కొరత తీరిపోయినట్టేనా? అంటే…ఏమో…వేచి చూద్దాం…తీరిపోతే మంచిదే కదా…!

