భగత్ సింగ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు..

భగత్ సింగ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన పోరాటం,త్యాగం అజరామరామని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో సోమవారం భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని వందల ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఆంగ్లేయుల పెత్తనాన్ని ఎదిరించి, పరాయి పాలన నుండి విముక్తి చేసిన వీరుడు భగత్ సింగ్ అని, 23 ఏళ్ళ వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడి తన దేహం కన్నా దేశo ముఖ్యమని, భారతదేశంలో కుల మత ప్రాంత విద్వేషాలు లేకుండా దేశంలోని ప్రజలంతా ఒకటేనని చాటి చెప్పినా మహోన్నతమైన వ్యక్తి అన్నారు. భగత్ సింగ్ వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, భగత్ సింగ్ కు భారతరత్న అవార్డును ప్రకటించాలని అన్నారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ఆక్ట్ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, బద్దుల సుధాకర్, రొండి నర్సింహా, టంగుటూరు రాములు, దాసరి మనోహర్, దాసరి సిద్దు తదితరులు పాల్గొన్నారు.
