బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ నాయకులు పొందన తరలి వెళ్లకుండా పోలీసులతో ముందస్తు అరెస్టు చేయడం అప్రజా స్వామి కమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, అధ్యక్షుడు ఆరే రవీందర్, తీవ్రంగా ఖండించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమవుతున్న సమయంలో మండల్ ప్రెసిడెంట్ కనికరం మధు, మండల అధ్యక్షులను ఆరే, రవీందర్ లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ చర్యను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
