Assembly | బీజేఎల్పీ నేత పిటిషన్ పై విచారణ

Assembly | బీజేఎల్పీ నేత పిటిషన్ పై విచారణ

Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టేయాలని ఏలేటి మహేశ్వరరెడ్డి కోరారు.

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు పోటీ చేశారని తెలిపారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలన్నారు. కర్ణాటక, బిహార్‌లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పులను ఏలేటి ప్రస్తావించారు. స్పీకర్ తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలిపింది.తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

Leave a Reply