బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఆరోగ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ తో బీజేపీ రాష్ట్ర కమిటీ సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వగా ఉట్నూర్ ఎస్సై విజయ ఆధ్వర్యంలో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ముందుగా బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఇంటికి వెళ్లి ఆయన అరెస్టు చేయగా బీజేపీ నాయకుల ఇండ్లకు వెళ్లి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, బీజేపీ పార్టీ ఉట్నూరు మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేశ్,సీనియర్ నాయకుడు శ్రీ రామ్ నాయక్ నాయకులు సిపతి లింగ గౌడ్ సాడిగే రాజేశ్వర్ బొడ్డు కిరణ్, సుమన్ భాయి,రాథోడ్ ఊరకొండ. శ్రీనివాస్, ఉగ్గే విజయ్ తదితర నాయకులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలు కోరకుండానే ఎన్నికల్లో బాండ్ పత్రాలు ఇస్తూ ఆరు గ్యారెంటీలు ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆయన విమర్శించారు.
హామీలను అమలు చేయాలని బిజెపి అసెంబ్లీ ముట్టడి చేస్తే ముఖ్యమంత్రి పోలీసులచే ముందస్తు అరెస్టు చేయించడం అప్రజా స్వామి కానీ అని అన్నారు. బిజెపి నాయకులను అరెస్టు చేసిన మాత్రాన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను ఆపగలరని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
