గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం…

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం…

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు మండలంలోని దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్న తండాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ బాదావత్ విజయ లింబ అన్నారు. ఆదివారం గ్రామపంచాయతీ పరిధిలోని భీముడు తండాలో సీసీ రోడ్డు పనులకు స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయి అన్నారు.

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో సమస్యలు లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభు, కాంగ్రెస్ పార్టీ మండల గిరిజన నాయకులు జాటోత్ సురేష్ నాయక్, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులు బాదావత్ అశోక్ నాయక్, 3వ వార్డు పార్టీ అధ్యక్షుడు జాటోత్ మోహన్, నాయకులు జాటోత్ వెంకన్న, లక్ పతి, తండావాసులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply