నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డికి సన్మానం
కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పొద్దుటూరి సతీష్ రెడ్డిని ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
నచ్చని ఎల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న, కాంగ్రెస్ నాయకుడు పెందూర్ మాధవ్ కలిసి సతీష్ రెడ్డిని శాలువాతో సత్కరించి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, సతీష్ రెడ్డి నియామకంతో జిల్లా లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
