ఆంజనేయస్వామి ఆలయంలో మాల దీక్షల ప్రారంభం

జైనూర్, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం జైనూర్,సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాలకు చెందిన భక్తులు 11 రోజుల ఆంజనేయస్వామి మాల దీక్షలను జైనూర్ ఆలయ పురోహితులు పండిత్ కులకర్ణి మహారాజ్ చేతుల మీదుగా స్వీకరించారు. మహారాజ్ వారికి మాలాధారణ వేసి దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దీక్ష స్వీకరించిన భక్తులు జై హనుమాన్ జై శ్రీరామ్ అంటు భక్తి భావాన్ని చాటారు.