40 million people | సీఎం తొలి సంతకం ఏమైంది…
40 million people | సీఎం తొలి సంతకం ఏమైంది…
40 million people | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం 4కోట్ల మందికి టోపీ పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారన్నారు. అభయహస్తం అనే దస్త్రంపై సీఎం రేవంత్రెడ్డి తొలి సంతకం చేశారు.. అది ఏమైందని అన్నారు.
గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్యారంటీలపై సంతకం జరిగిందని చెప్పించారన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ ప్రైవేటు మెంబర్ ప్రవేశపెట్టనున్నామన్నారు. వచ్చే శుక్రవారం శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు.. వెంటనే అమలు చేయాలన్నారు. పింఛను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారు.. వెంటనే పెంచాలన్నారు. విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
