ఘనంగా రంజాన్ వేడుకలు…
ఘనంగా రంజాన్ వేడుకలు…
చల్లగరిగవేడుకల్లో చిట్యాల ఎస్ఐ సతీష్…
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం ముస్లిం సోదరులు మజీదులలో ప్రార్థనలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని కౌసరే ఏ మసీద్ ఆవరణలోని ఈద్గా మైదానంలో పవిత్ర రంజాన్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులందరూ ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటూఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం 30 రోజుల కఠోర ఉపవాస దీక్ష విరమించుకొని రంజాన్ ఈద్గాలో నమాజ్ ప్రార్ధన చేసుకుని ఆప్తులను స్నేహితులను కలుసుకొని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, అజ్మత్ మియా, హైదర్ పాషా, ఉపాధ్యక్షుడు షఫీ పాషా, జాయింట్ సెక్రెటరీ అక్బర్, ట్రెజరర్ హుస్సేన్, ఆరిఫ్, సాజిత్, మహమూద్ అల్లి పాషా, హైమద్, తదితరులు పాల్గొన్నారు.

