రంజాన్ నమాజ్ కు హాజరైన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

రంజాన్ నమాజ్ కు హాజరైన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని మంతపురి రోడ్డు ప్రధాన దర్గాలో జరిగిన ప్రత్యేక రంజాన్ మాజ్ కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

నమాజ్ ను నిర్వహించి రంజాన్ సందేశం అందించిన ఇమామ్ తో పాటు పట్టణ ముస్లిం సోదరులు, మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎండి జైనుద్దీన్, నాయకులు బీజన భాస్కర్, మల్లెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply