ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ విప్ బాధ్యతలు…

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ విప్ బాధ్యతలు…
మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీలో ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా కొనసాగేందుకు కీలక పాత్ర పోషించనున్నారు.
సభలో ప్రభుత్వ విధానాలకు మద్దతు కూడగట్టడం, పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సాధించడం వంటి బాధ్యతలను నిర్వహించనున్నారు.ఈ నియామకంపై మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాకు చెందిన నాయకుడికి కీలక పదవి దక్కడం గర్వకారణమని పేర్కొంటూ, ఆయన అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం ఈ బాధ్యతల్లో విజయానికి దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విప్‌గా రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ప్రజాసేవ అందిస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన నియామకంతో మహబూబ్‌నగర్ జిల్లాకు మరింత అభివృద్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
