రంజాన్ సందర్భంగా మైనార్టీలకు ఇఫ్తార్ కిట్లు పంపిణీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోటిపల్లి మండలంలోని అన్ని గ్రామాల పేద మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ కిట్లను పంపిణీ చేశారు. మైటీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 250 కిట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త పెద్దకాపు నాయుడు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, కరీంపూర్ మాజీ సర్పంచ్ సుందరి అనిల్ ఆధ్వర్యంలో, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ సమక్షంలో నిర్వహించారు. కిట్లు అందుకున్న మైనార్టీ సోదరులు నాయుడు సేవలను అభినందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కరీంపూర్ సర్పంచ్ సాధాత్ పటేల్, జిన్నారం సర్పంచ్ హుస్సేన్, ఎంకేపల్లి సర్పంచ్ రవికుమార్, ఉప సర్పంచ్ మైబూబ్, అనిల్, నర్సింలు, యూత్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు గొడ్డలి మల్లయ్య, మైనార్టీ అధ్యక్షుడు హాజీ మస్తాన్, యువ నాయకులు అరుణ్, శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు యాకుబ్ మైనొద్దీన్, నాయకులు వెంకటేష్, మదర్ సబ్, అబ్బు సిద్ధిక్, రషీద్, ఫైజొద్దీన్, సుందరి బండయ్య, షేర్ అలీ తదితరులు, గ్రామ పెద్దలు, మహిళలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.