ఘనంగా ఉగాది వేడుకలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో నూతన సంవత్సరం ఉగాది పర్వదినం (శ్రీ పరాభవ నామ సంవత్సరం) వేడుకలు ,ప్రజలు దేవాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో పాడిపంటలు బాగుగా పండి, పిల్లా పాపలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, దేవాలయంలో ప్రజలు వేడుకున్నారు. అనంతరం నూతన పంచాంగ శ్రవణం పూజారులు నిర్వహించారు.

మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ- కంఠమహేశ్వర ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి, గీతా కార్మికులకు, ప్రజలకు, ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల రాజు, సభ్యులు గుర్రపు రాజు, బుర్ర నరేష్, బుర్ర రాజ్ కుమార్, ఆముదాలపల్లి శ్రీనివాస్, కుల పెద్దలు, గీత కార్మికులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply