కడెం లో చలివేంద్రం ప్రారంభం..

కడెం లో చలివేంద్రం ప్రారంభం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని ఆర్ టి సి బస్టాండ్ వద్ద వేసవికాలం పురస్కరించుకొని పెద్దూర్ కడం జిపి ఆధ్వర్యంలో జిపి ప్రజలకు మండల కేంద్రానికి వస్తున్న ప్రజల కోసం త్రాగునీరు అందించడానికి బుధవారం చలివేంద్రమును ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రమును పెద్దూరు కడం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ ఉప సర్పంచ్ పిట్టల రాజన్న లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దూర్ జిపి ప్రజలు అలాగే కడెం మండల కేంద్రానికి వస్తున్న పలు గ్రామాల ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి మునురుల్ హసన్ జిపి వార్డు సభ్యులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.