పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి

పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం, కూటమి ప్రభుత్వం చేపట్టే పథకాలను, ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో మేలు జాతి లేగ దూడల ప్రదర్శన శిబిరం కార్యక్రమంలో భాగంగా మండలంలోని షేక్ షాన్ పల్లి గ్రామంలో మంగళవారం మేలు జాతి లేగ దూడల ప్రదర్శన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయభాస్కర్, పశుసంవర్ధక శాఖ డిడి ఉమామహేశ్వర్, డిఎల్ డిఏ ఈవో వెంకటేశులు, ఏడి పెద్దన్న, పశువైద్యాధికారి హరీష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిడి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఆడ దూడల ఉత్పత్తి పథకం కింద పూర్తిగా ఉచితం అన్నారు. 90 శాతం ఆడ దూడలు పుట్టే అవకాశం అన్నారు. మెరుగైన జాతి ఉత్పత్తి త్వరిగతిన జాతి మరియు పాల దిగుబడి వృద్ధి, పాడి రైతులకు ఆర్థిక
స్వాలంబన్నారు.

ఈ సందర్భంగా డి ఎల్ డి ఏ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో పెయ్య దూడల ఉత్పత్తి పథకం కింద, యద సూది పూర్తిగా ఉచితంగా అన్నారు. లింగ నిర్ధారిత వీర్యం ద్వారా 90 శాతం ఖచ్చితత్వంలో పెయ్య దూడలు కు పుట్టించడం. మేలు జాతి పెయ్య దూడలు పుట్టించడం ద్వారా పాల దిగుబడి వస్తుందన్నారు. తద్వారా రైతుల ఆదాయం పెంపొందిం చడం తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ మేలు జాతి పెయ్య దూడలు పుట్టించడం, ద్వారా గ్రామాలలో గ్రామాలలో మేలు జాతి, పశుసంపదను అభివృద్ధి చేయడం అన్నారు.
ఈ సందర్భంగా ఏడి పెద్దన్న మాట్లాడుతూ పశు సంపద, పశుపోషణపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం మేలు జాతి లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో గెలుపొందిన పాడి రైతులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి అధికారి రాఘవేంద్ర, ఎల్ ఎస్ ఏ సిరాజుద్దీన్, గ్రామ పశుసంవర్ధక సహాయకులు అనిల్, రవి, లక్ష్మీనారాయణ, వేణు, కరీముల్లా, నిఖిల, అశ్విని, సలాం, వెంకటేశులు, గురు స్వామి, టిడిపి నాయకులు నరేష్, రఘు రాములు తదితరులు పాల్గొన్నారు.
