ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ..

ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ..

విజయవాడ (కార్పోరేషన్), ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీనిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆస్తి పన్ను బకాయిదారులందరూ ఏక మొత్తంలో ఆస్తి పన్ను మరియు వడ్డీ చెల్లించినచో, వడ్డీ పై 50 శాతం రాయితీని పొందవచ్చని అన్నారు.

ఈ అవకాశం మార్చి 31, 2026 వరకు మాత్రమే అని, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పన్ను చెల్లింపులకు విజయవాడ నగర పరిధిలో గల అన్ని క్యాష్ కౌంటర్లలోనూ, మీ దగ్గరలోని సచివాలయాల్లోనూ, ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చని తెలిపారు.

Leave a Reply