నిజాంసాగర్ కెనాల్ లో పడి వృద్ధుడు మృతి

నిజాంసాగర్ కెనాల్ లో పడి వృద్ధుడు మృతి

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారు ప్రాంతంలో గల నిజాంసాగర్ కెనాల్ లో పడి మృతి చెందినట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రామ తెలిపారు. ఈనెల 15వ తేదీన గ్రామానికి చెందిన భాగోల పరువయ్య (68) అనే వృద్ధుడు కాలకృత్యాల నిమిత్తం నిజాం సాగర్ కెనాల్ వైపు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబీకులు పిర్యాదు చేయడం తో మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు.

సోమవారం అలీసాగర్ చెరువులో పరువయ్య మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. గ్రామ సర్పంచ్ గంటే శ్రీనివాస్ పిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply