వీధి కుక్క దాడిలో బాలునికి తీవ్రగాయాలు..

వీధి కుక్క దాడిలో బాలునికి తీవ్రగాయాలు..

ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ఆరేండ్ల యాదగిరి ఆదిత్యపై ఓ కుక్క సోమవారం దాడి చేసి తీవ్ర గాయాలలు చేసింది.గ్రామంలోని ఇంటి ముంగట ఆ బాలుడు ఆడుకుంటుండగా ఓ కుక్క దాడి చేసి పెదవి, చెంపలను కొరికింది.దాడి ఘటన చూసిన అక్కడివారు పరుగున వచ్చి కర్రలతో దాడి చేయగా,ఆ కుక్క పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలుని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు యాదగిరి గోపాల్,శిరీష విలపిస్తూ తెలిపారు.బాలున్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ గ్రామ సర్పంచి వనిత- శ్రీనివాస్ పరామర్శించ్చారు.

Leave a Reply